ముస్తాబాద్, ఫిబ్రవరి 21 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలో రజకుల కులదైవమైన మడేలేశ్వరస్వామి ఆలయంలో ఆస్వామి వారికి కళ్యాణ మహోత్సవం నేత్రపర్వంగా ఏర్పాట్లు చేసి సన్నాయి వాయిద్యాలతో నూతన వస్త్రాలు గ్రామంలో ఊరేగింపులో భాగంగా అంగరంగ వైభవపేతంగా నిర్వహించారు. రజకులు కుటుంబ సమేతంగా మహిళలు ఒకే రకమైన వస్త్రాలు ధరించారు. ఈ సందర్భంగా రజకులు మాట్లాడుతూ మాకుల దైవమైన స్వామిని ఆరాధిస్తే మా కుటుంబాలు బాగుండి పట్టిందల్లా బంగారం అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని మా ప్రగాఢ నమ్మకం అన్నారు. గత సంవత్సరం నూతన ఆలయం నిర్మించి ప్రథమ వార్షికోత్సవం జరుపుకొని మొదటి సంవత్సరం కాగా సంవత్సరంలోపు మారు మహోత్సవ పూజలు అందించమన్నారు. ఈ సంవత్సరం నుండి మరల రెండో వార్షికోత్సవం ఐదు సంవత్సరాలకు జరుపుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు భారీ మొత్తంలో రజకులు కులసంఘ సభ్యులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
