ప్రాంతీయం

పురుగుల మందు తాగి చావండి, డబ్బులు లేకపోతే నేను ఇస్తా.. -గిరిజనుల పట్ల ఎఫ్ఆర్వో నిర్లక్ష్య ధోరణి.

26 Views

పురుగుల మందు తాగి చావండి, డబ్బులు లేకపోతే నేను ఇస్తా.. -గిరిజనుల పట్ల ఎఫ్ఆర్వో నిర్లక్ష్య ధోరణి.

మంచిర్యాల జిల్లా, ఫిబ్రవరి 21

మంచిర్యాల జిల్లా జన్నారం రేంజ్ లోని గడ్డంగూడలో గిరిజనులు వేసుకున్న గుడిసెలు అటవీ అధికారులు తొలగించారు, కానీ ఎటు వెళ్ళాలో తెలియక అక్కడే ఉంటున్న గిరిజనుల వద్దకు వచ్చి వెంటనే ఖాళీ చేయాలి లేకపోతే సామాన్లను అంతా రేంజ్ కార్యాలయానికి తరలిస్తాం అంటూ బెదిరించిన ఎఫ్ఆర్వో సుష్మా.

రెండు రోజులు సమయం ఇవ్వాలని గిరిజనులు బ్రతిమాలగా “పురుగుల మందు తాగి చావండి.. డబ్బులు లేకపోతే నేనే ఇస్తా” అని కించపరిచే విధంగా మాట్లాడిన ఎఫ్ఆర్వో సుష్మా.

అవమానం తట్టుకోలేక రాథోడ్ తుకారాం అనే గిరిజన రైతు మందు గుళికలు మింగి ఆత్మహత్యాయత్నం

రాథోడ్ ని తీసుకొని రేంజ్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగిన గిరిజనులు.. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలింపు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్