ముస్తాబాద్, ఫిబ్రవరి 12 (24/7న్యూస్ ప్రతిది): సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బుధవారం మండల పరిధిలోని సాయంకాలం గూడూరు గ్రామంలో మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మొగిలి, ఎస్సై చిందం గణేష్ మాట్లాడుతూ మీకోసం కార్యక్రమం పురస్కరించుకొని సిసి కెమెరాల, రోడ్డు ప్రమాదాలు, కుల నిషేధం, సైబర్ నేరాలు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, బ్లాక్ మ్యాజిక్‌లతో సేఫ్టీ అల్లారం సౌండ్ తో పాటు వివిధ అంశాలపై చర్చించి గ్రామస్తులకు సూచననలు చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులతోపాటు గ్రామస్తులు పాల్గొన్నారు.
