(శంకరపట్నం మే 10)
శంకరపట్నం మండల కేంద్రంలో అక్రమంగా బంకమట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్లను కేశవపట్నం పోలీసులు పట్టుకున్నారు.
శంకరపట్నం మండల కేంద్రం నుండి కరీంనగర్ కు అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా బంక మట్టిని మూడు టిప్పర్ల ద్వారా తరలిస్తుండగా పట్టుకొని గనులు భూగర్భజల శాఖ అధికారులకు అప్పజెప్పామని ఎస్సై లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
అనుమతులు లేకుండా అక్రమ రవాణా చేసే వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు..