ప్రాంతీయం

పేదింటి ఆడపడుచుకు పుస్తే మట్టెలు అందజేతా…

102 Views
  1. పేదింటి ఆడపడుచుకు పుస్తే మట్టెలు అందజేతా…

సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 12

పేదింటి ఆడపడుచు వివాహానికి పుస్తె మట్టెలు, పెండ్లి చీరె అందజేసే అండగా నిలిచాడు శ్రీ నూతన గౌడ సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ గుండుకాడి వెంకటేష్ గౌడ్. బుధవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామంలో,రిత్విక నివాసంలో కుమ్మరి చంద్రం కూతురు రిత్విక కు ఆయన చేతుల మీదుగా పుస్తె మట్టలు, పెండ్లి చీరే అందజేశారు. ఈ వివాహం ఈనెల 14 వ తేదీన జరుగనున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఎన్ని ఆస్తులు డబ్బులు సంపాదించిన కలగని సంతోషం నిరుపేద కుటుంబాలకు సాయం చేయడంలో ఎంతో సంతోషం కలుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, గ్రామమస్థులు తదితరులు పాల్గొన్నారు.

 

No Slide Found In Slider.

Poll not found