అక్టోబర్ 7వ తేదీన బహుజన సింహగర్జన సభ విజయవంతం చేయడం కోసం సాగర్ నియోజకవర్గం 3వ విడతలో భాగంగా బహుజన చైతన్య సైకిల్ యాత్ర అనుముల మండలంలో కి చేరుకుని 5వ రోజు బహుజన చైతన్య సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా బస్టాండ్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బహుజన్ సమాజ్ పార్టీ ( బిఎస్పీ ) సాగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆదిమల్ల వెంకటేష్ మాట్లాడుతూ… సాగర్ నియోజకవర్గంలోని 6 మండలాల లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకుల పేదల లో ఉన్న ప్రజలను ఓటు చైతన్యం ద్వారా అవగాహన కల్పించి వారందరికీ బహుజన సమజ్ పార్టీని ఏనుగు గుర్తును పరిచయం చేసామని తెలిపారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో హామీలు తప్ప ఆచరణ లేదని వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని రాజకీయంగా సమాధి చేసి బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.ఈ బహుజన చైతన్య సైకిల్ యాత్ర చేరుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ సాగర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు బత్తుల ప్రసాద్ , నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ముదిగొండ వెంకటేశ్వర్లు , నియోజకవర్గ కోశాధికారి రేపాక నరసింహ , మహిళా కన్వీనర్ బైరాగి విజయ , అనుముల మండల అధ్యక్షుడు జిల్లా మధు , గుర్రంపోడు మండల అధ్యక్షుడు కొమ్ము రమేష్ , మండల మండల అధ్యక్షుడు కుక్కముడి ముత్యాలు , పెద్దవూర మండల ప్రధాన కార్యదర్శి ఆదిమల్ల సత్యనారాయణ , రాజు తదితరులు పాల్గొన్నారు.





