* కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి
దౌల్తాబాద్:తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తు గారి కిష్టారెడ్డి అన్నారు.మండల కేంద్రం రాయపోల్ గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రతి కాలనీలో సిసి రోడ్డు దాదాపు రూ.80 లక్షల సిసి రోడ్డు నిర్మాణ పనులు చేయించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సత్తుగారి కిష్టారెడ్డికి గ్రామస్తులు శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున రాయపోల్ అభివృద్ధికి సహకరించిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు, కాంగ్రెస్ పార్టీ దుబ్బాక అసెంబ్లీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షులు బాగన్న గారి రాజిరెడ్డి, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు.