ప్రాంతీయం

ఏరులై సాగుతున్న మద్యం.. పుస్తెలు తెంపుతున్నా..చోద్యం…

116 Views

ముస్తాబాద్, జనవరి 6 మండలంలో ఏదేచ్ఛగా మూడు పువ్వులు ఆరు కాయలుగా బెల్ట్ షాపులు.. సామాన్య మానవుడే అధికంగా మద్యానికి బానిస. గ్రామవీధుల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తుండటంతో మద్యం మత్తులో ఇంటికి వచ్చి మహిళలను దుర్భాషలాడుతూ, వేధిస్తూ, కొడుతూ, మానసిక ప్రశాంతత లేకుండా చేస్తున్నారని పలువురు పేర్కొన్నారు. కొందరు మద్యం మత్తులో వీధుల్లో తిరుగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, మద్యం సేవించిన మత్తులో అసభ్యకర పదజాలాలతో మాట్లాడుతున్నారని గ్రామ పెద్దలు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యానికి బానిసై కొన్ని కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా చిన్నాభిన్నమైనదే కాకుండా గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందన్నారు. కొందరు పొద్దంతా కష్టం చేసిన సొమ్మును కుటుంబం గురించి ఆలోచించకుండా మద్యానికి వెచ్చిస్తున్నారు. బెల్టుషాపుల నిర్వహించేవారు వచ్చిందే పైకమని ఏ రాత్రైనా తలుపు తట్టితే చాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని అక్షరాలు నిజం. తాగి ఇంటికి పోయేది తెలవదు పడిపోయేది తెలువదు. తన భార్యపిల్లలు రాత్రంతా ఎదురు చూసి చూసి తిని నిద్రిస్తారు. ఇదంతా మద్యం అమ్మే వాళ్ళకి అవసరం లేదు.. తాగి పడిన ఇంతా జరిగిన ధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడం గమనార్హం.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్