ప్రాంతీయం

ముస్తాబాద్ మడలేశ్వరస్వామి ఆలయంలో చోరీ…

214 Views

ముస్తాబాద్, జనవరి 8 (24/7న్యూస్ ప్రతినిధి) ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ముస్తాబాద్ మండల కేంద్రంలోని రజకులు ఆరాధ్య దేవతలైన మడలేశ్వర ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… ముస్తాబాద్ గ్రామ పరిధిలో ఉన్న మడలేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు రోజువారి లాగే పూజలు నిర్వహించి అనంతరం అలయానికి తాళంవేసి వెళ్లారు. కాగా అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఆలయ ప్రధాన ద్వారానికి వేసిన తాళాన్ని పగులగొట్టి ఆలయంలోకి చొరబడి అమ్మవారిపై పుస్తె మెట్టెలు తదితర విలువ చేసే బంగారు ఆభరణాలను అపహరించారు. బుధవారం ఉదయం ఆలయ అర్చకులు వచ్చి చూడగా ఆలయానికి ఉన్న ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లిచూడగా అమ్మవారి ఆభరణాలు కనిపించలేదని సమాచారం అందించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్