ప్రాంతీయం

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే

172 Views

మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గం.

కోటపల్లి మండలంలోని మల్లంపేట గ్రామానికి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి విచ్చేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు.

డప్పు చప్పుళ్లతో గ్రామంలో ర్యాలి నిర్వహించిన గ్రామస్తుల, స్థానిక నాయకులు.

గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి.

కోటపల్లి మండలానికి సంబంధించి 10 సీసీ రోడ్లు, 12 డ్రైనేజీ పనులకు, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేసిన వివేక్ వెంకటస్వామి.

సుమారు కోటీ పది లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన వివేక్ వెంకటస్వామి.

వివేక్ కామెంట్స్.

నేను మళ్లంపేట గ్రామంలో మొట్ట మొదటి మీటింగ్ కు మా అన్న గారు వినోద్ గారితో ప్రచారంలో పాల్గొన్నాను.ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఘనంగా గెలిపించారు.ఎన్నికల సమయంలో నేను ప్రచారం చేసినప్పుడు ఇక్కడ ఇచ్చిన హామీ మేరకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.చెన్నూర్ నియోజకవర్గంలో సుమారు వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్దే ధ్యేయంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. అటవీశాఖ అనుమతులు రాక ఇబ్బందులు ఉన్నాయి.అటవీశాఖ అనుమతుల కోసం నేను మన ఎంపీ వంశీ కృష్ణ కేంద్ర మంత్రి తో మాట్లాడడం జరిగింది.త్వరలోనే అనుమతులు వస్తాయి. అనుమతులు రాగానే పనులను ప్రారంభించడం జరుగుతుంది.

No Slide Found In Slider.

Poll not found