సమగ్ర శిక్ష సిబ్బంది సమస్యలను పరిష్కరించాలి
-సుంచు నరేందర్
టిఫిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి
సిద్దిపేట జిల్లా డిసెంబర్ 22
గత పదమూడు రోజులుగా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న సమ్మె పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, వెంటనే సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సిద్ధిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సుంచు నరేందర్ డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా సమ్మె శిబిరాన్ని జిల్లా ఉపాధ్యక్షులు అజీజ్ మరియు రాయపోల్ మండల ప్రధాన కార్యదర్శి కనకయ్య గార్ల తో సందర్శించి మాట్లాడారు.దారిద్ర్య రేఖకు దిగువన ఉండి, వెనుకబడిన వర్గాల ఆడపిల్లలకు మంచి విద్యను అందించాలనే ఆశయంతో 2004 లో దేశ వ్యాప్తంగా 4962,కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను నడుపుతున్నారు. లక్షా ఇరవై ఐదు వేల మంది విద్యార్థినీలు చదువుతుండగా, సుమారు 20 వేల మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ కేజీబీవీలలో స్పెషల్ అధికారి, సీఆర్టీ, వీజెసిఆర్టీ, పీఈటీ, అకౌంటెంట్, ఎఎన్ ఎం, కంప్యూటర్ ఇన్స్ ట్రక్టర్, 20 ఏండ్లుగా కనీస వేతనం లేకుండా కాంట్రాక్ట్ పద్ధతిన పనిజేస్తున్నారు. అదే విధంగా సమగ్ర శిక్షలో మండల యం.ఐ. ఎస్ కోఆర్డినేటర్, కంప్యూటర్ ఆపరేటర్, మెస్సెంజర్, క్లస్టర్ రిసోర్స్ పర్సన్, జిల్లా స్థాయిలో ఏపీవో, సిస్టం అనాలిస్ట్, టెక్నీకల్ వర్సన్, అటెండర్, డివిజన్ స్థాయిలో డీ ఎల్ ఎం టి లు ఫిక్సడ్,
వేతనంపై పనిచేస్తున్నారు. వీరికి సమాన పనికి సమాన వేతనం అన్న సుప్రీమ్ కోర్ట్ తీర్పును అమలు చేయకుండా. చాలీ చాలని జీతంతో జీవితాలు వెల్లడిస్తున్నారు. మొదటి ప్రభుత్వంలో పే రివిజన్ కమిషన్ సిఫార్సులు మేరకు చెల్లించడం లేదు. ఉద్యోగ భద్రత లేదు, ఆరోగ్య కార్డులు అమలు లేదు. సెలవులు వినియోగించుకోవాలన్నా ఎన్నో ఆంక్షలు. సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వారిని ఇతర రాష్ట్రాలలో క్రమబద్ధీకరించారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా సేవలను క్రమబద్ధీకరించాలని ఉద్యమలు జరుగుతున్నప్పటికీ కూడా పాలకులు పట్టించుకోవడం లేదు, పలు డిమాండ్ల పరిష్కారం కోసం సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న ఈ పోరాటాన్ని టిసిటిఎఫ్ గుర్తించి, వారికి మద్దతుగా నిలుస్తుంది. విద్యారంగంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి, బోధన సిబ్బందిని రెగ్యులర్ ఉపాధ్యాయులుగా, బోధనేతర సిబ్బందిని రెగ్యులర్
ఉద్యోగులుగా గుర్తించి, వేతన స్పెలును అమలు చేయాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ విద్యా శాఖలో విలీనం చేయాలి. 20 లక్షల ఉద్యోగ విరమణ బెనిఫిల్ ఇవ్వాలి. మరణించిన ఉద్యోగ కుటుంబాలకు 15. లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి. ప్రతి ఉద్యోగికి 10 లక్షల జీవిత భీమా చెల్లించాలి. 5 లక్షల ఆరోగ్య భీమా సౌకర్యం కల్పించాలి. కెజిబివి స్పెషల్ అధికారులకు మోడల్ స్కూల్ నిర్వహణ బాధ్యతలను తొలగించాలి.
27 రోజులు సాధారణ సెలవులు, పిల్లల సంరక్షణ సెలవులు, హిస్టరెక్టమీ సెలవులు ఇవ్వాలి. అందరికి ఆరోగ్య కార్డుకు ఆమెకు వేయాలి. ప్రతి సంవత్సరం రెన్యూవల్ పద్ధతిని తొలగించాలని కోరారు.
