మంచిర్యాల జిల్లా.
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్న అయ్యప్ప భక్తులు సౌకర్యార్థం సిర్పూర్ కాగజ్ నగర్, మంచిర్యాల మీదుగా శబరిమలకు ప్రత్యక రైలు ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు హైదరాబాద్ లో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ ప్రాంతం నుండి వందల మంది అయ్యప్ప భక్తులు శబరిమల దర్శనానికి వెళ్ళనున్న నేపథ్యంలో ఈ విషయం పై రైల్వే అధికారులు దృష్టికి తీసుకెళ్ళి ప్రత్యేక రైలు ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కోరడం జరిగింది.
