రాజకీయం

మాజీ సర్పంచులు ముందస్తు అరెస్ట్..

37 Views

(తిమ్మాపూర్ డిసెంబర్ 09)

ఛలో అసెంబ్లీ పిలుపు కార్యక్రమానికి పాల్గొనేందుకు వెళ్తున్న
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని వివిధ గ్రామాల మాజీ సర్పంచ్ లను మండల పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ

తమకు రావాల్సిన పెండింగ్ బిల్లులు ఇవ్వకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచుల ఫోరం ఛలో అసెంబ్లీ ముట్టడి పిలుపునివ్వడంతో అ కార్యక్రమానికి తరలి వెళ్తున్న తమను అక్రమంగా అరెస్టు చేయడం బాధాకరమని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సిన పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరుచున్నామని అన్నారు..

అరెస్ట్ అయిన వారిలో తాజా మాజీ సర్పంచ్ లు రావుల రమేష్, మేడి అంజయ్య, వడ్లూరి శంకర్ మామిడి సతీష్ లు అరెస్ట్ అయ్యారు…

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్