– దుబ్బాక బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు
దౌల్తాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి నేటి వరకు అన్ని రంగాల్లో విఫలమైందని దుబ్బాక బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని గాజులపల్లి, దొమ్మాట, ముబారస్ పూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన రెండున్నర సంవత్సరాల్లో నియోజకవర్గంలో అభివృద్ధి కోసం పనిచేసినట్లు తెలిపారు. తాను తక్కువ సమయంలోనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చానని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో పేదలకు ఏమి చేసిందో తెలపాలన్నారు. కడుపునొస్తే గ్రామాల్లో గోలి దొరకదు కానీ మందు సీసాలు మాత్రం దొరుకుతాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది లిక్కర్తోనని అన్నారు. దళిత బంధు బీసీ బందు రాలే కానీ తాగేందుకు మద్యం వచ్చిందన్నారు. అసెంబ్లీలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని నిలదీశానని అన్నారు. నన్ను గెలిపిస్తే దొమ్మాటను మండలం చేస్తానని అన్నారు. కమలం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే పేద ప్రజలు గొంతుకగా అసెంబ్లీలో ప్రశ్నిస్తానని పేర్కొన్నారు.అనంతరం ముబారస్ పూర్, సూరంపల్లి గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు కొత్త సురేందర్ రెడ్డి, పంచమి స్వామి, ముబారస్ పూర్, సూరంపల్లి ఉపసర్పంచ్లు స్వామి, బొల్లం స్వామి, బిజెపి మండల అధ్యక్షుడు పోతురాజు కిషన్, ఉపాధ్యక్షుడు గడ్డమీది స్వామి, నాయకులు ప్రసాద్ రావు, శ్రీకాంత్ గౌడ్, రంజిత్ గౌడ్, దుర్గారెడ్డి,చందు, లక్ష్మణ్, చంద్రం గౌడ్, రమేష్, భూపాల్ రెడ్డి, రామస్వామి గౌడ్, ముత్యాల శ్రీనివాస్, సత్యనారాయణ గౌడ్, అనిల్ రెడ్డి, రమేష్ గౌడ్, తుమ్మల గణేష్, కుర్మ గణేష్, నాగరాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు…..