ఆధ్యాత్మికం రాజకీయం

ముసుగులు తొలగించేలా చర్యలు చేపట్టండి…

63 Views

–లేదంటే ఆందోళనలకు సిద్ధం.

–తహసీల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన జేఏసి నాయకులు

(తిమ్మాపూర్ డిసెంబర్ 02)

తిమ్మాపూర్ మండల కేంద్రం ఆర్టిసి బస్టాండ్ ముందు నెలకొల్పిన మహనీయుల విగ్రహాలపై ముసుగులు తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టేలా ప్రభుత్వానికి నివేదించాలని తిమ్మాపూర్ జేఏసి నాయకులు సోమవారం తహసీల్దార్ కార్యాలయం లో వినతిపత్రం అందించారు.గత ప్రభుత్వం లో రెండేళ్ల క్రితం నెలకొల్పిన అంబేద్కర్ మరియు బాబు జగ్జీవన్ రాం ల విగ్రహలపై ముసుగులు తొలగించడం లో జరుగుతున్న కాలయాపన పై అఖిల పక్ష పార్టీ లు, ప్రజాసంఘాలు,ప్రజాసామ్యవాదులంతా కలిసి ఇటీవల జేఏసి గా ఏర్పడిన క్రమంలో మొదటిసారిగా తహసీల్దార్ కు వినతిపత్రం ద్వారా కార్యాచరణ ప్రారంభించనున్నట్లు సభ్యులు పేర్కొన్నారు.విగ్రహాలపై ముసుగులు తీయకపోవడం తో మహనీయుల విగ్రహాలకు గౌరవం కల్పించడం లో ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు వినతిపత్రం లో పేర్కొన్నారు. ముసుగులు తొలగించడం లో జరుగుతున్న నిర్లక్ష్యం విషయంలో, స్థానికంగా ఏర్పడుతున్న సమస్యలపై ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన నివేదిక ఇవ్వాలని తహసీల్దార్ ను వినతిపత్రం లో కోరారు.

జేఏసి కన్వీనర్ లు మాతంగి శంకర్, దుండ్ర రాజయ్య, సుగుర్తి జగదీశ్వరాచారి, తీన్మార్ మల్లన్న సభ్యులు అఖిల్ పాషా లు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, మాజీ ఉప ప్రధాని జగ్జీవన్ రాం ల విగ్రహాలపై ముసుగులు తొలగించాలని ఏర్పాటు చేసిన జేఏసి వెనక ఎవ్వరి ప్రొద్భలం లేదని ముఖ్యనాయకులు గమనించాలని తెలిపారు. ఒక వారం పాటు శాంతియుత నిరసన కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళ్తామని అన్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ ను కూడా కలుస్తామని అన్నారు.

అయినప్పటికీ సమస్య పరిష్కారం కనట్లాయితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టుతామని పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలకు స్థానిక గ్రామపంచాయతీ తీర్మానం తో అనుమతులిచ్చారని, కేవలం మహనీయుల విగ్రహాల విషయంలో ఎందుకు గ్రామ పంచాయతీ తీర్మానం ను పక్కన పెట్టుతున్నారని ప్రశ్నించారు. ముసుగులు తొలగించడం విషయం లో త్వరలో స్థానిక ఎమ్మెల్యే ను కలుస్తామని తెలిపారు.తహసీల్దార్ అందుబాటులో లేకపోవడం తో సీనియర్ అసిస్టెంట్ షరీఫ్ కు వినతిపత్రం ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జేఏసి కన్వీనర్ వంతడుపుల సంపత్,సభ్యులు పార్నంది జలపతి, కొయడ మురళీ,బోయిని తిరుపతి, సందుపట్ల మల్లేశం,కొమ్ము సంపత్,తుర్పాటి అజయ్, గజా సాగర్,ఇనుకొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్