(తిమ్మాపూర్ ఏప్రిల్ 07)
మానకొండూర్ శాసన సభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఎల్ఎండి కాలనీలోని క్యాంప్ కార్యాలయంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ..
సక్రమ మార్గంలో నడుచుకుంటూ, దేవుని యందు భక్తి విశ్వాసాలు కలవారికి వారి కర్మానుసారం మంచి జీవితం పొందగలుగుతార న్నారు.అల్లా అనుగ్రహం మీకు ఎల్లవేళలా ఉండాలని, మీరంతా జీవితాన్ని సుఖశాంతులతో ఆనందంగా గడపాలని కోరుకుంటూ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.అంతకు ముందు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఎమ్మెల్యేకి దీవెనలు అందజేశారు.