ప్రజాపాలనలో రైతు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చాం.. నిలబెట్టుకున్నాం..!
మంచిర్యాల నియోజకవర్గం.
ఎమ్మెల్యే సాగరన్నకు రైతులు, గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు.
దండేపల్లి మండల ద్వారక గ్రామంలో రైతు వేదిక వద్ద జరిగిన రైతు రుణమాఫీ సంబరాల్లో పాల్గొన్న మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ , మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , అధికారులు,రైతులు..
అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , రైతులు..
ఇచ్చిన హామీ మేరకు రైతులు బ్యాంక్ లో తీసుకున్న పంట రుణాన్ని మాఫీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి మంచిర్యాల శాసనసభ సభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , రుణ విముక్తులతో కలిసి పాలాభిషేఖం చేశారు.
గురువారం రుణమాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించగానే మంచిర్యాల నియోజకవర్గం వ్యాప్తంగా సంబరాలు ప్రారంభమయ్యాయి. వర్షంలో సైతం రైతులు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేఖం చేశారు. దండెపల్లి మండలం ద్వారక గ్రామంలోని రైతు వేదికకు చేరుకున్న ఎమ్మెల్యే , కలెక్టర్ దీపక్ కుమార్ లకు రైతులు స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి లక్సెట్టి పేట, హజీపూర్ మండలాల్లో రైతు సంబరాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు. హజీపూర్ నుంచి మంచిర్యాల మీదుగా నస్పూర్ వరకు ర్యాలీగా వెళ్లారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసిందన్నారు. విపక్షాలు రుణమాఫీ చేయరంటూ ఎన్ని విమర్శలు చేసినా వారికి దిమ్మతిరిగే విధంగా రుణమాఫీ చేసి గూబగుయ్యి మనిపించామని అన్నారు. పాస్ బుక్ లు ఉన్న ప్రతి రైతుకు బ్యాంక్ లో రుణమాఫీ ఉంటుందని ఉంటుందని రైతులు ఆందోళన చెందవద్దని కోరారు.
