పేదరికంతో ఆడబిడ్డ పెళ్లి చేయాలంటేనే తల్లిదండ్రులకు గుండె భారంగా అవుతుందని నిరుపేద యువతీ వివాహానికి మానవత్వంతో చేయూతనివ్వడం జరిగిందని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజాసేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో నిరుపేద యువత వివాహానికి బియ్యం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాలు ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. సూరంపల్లి గ్రామానికి చెందిన గంగాధరి స్వరూప- సైదయ్య దంపతులకు ముగ్గురు కూతుర్లు కాగా గతంలో పెద్ద కూతురు వివాహం చేశారు. రెండవ కూతురు స్వాతి వివాహం చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని మా దృష్టికి రాగా మా వంతు సహకారంగా ఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వాతి వివాహానికి 50 కిలోల బియ్యం అందజేయడం జరిగిందన్నారు. ఇంకా ఎవరైనా మానవతావాదులు వీరి వివాహానికి సహాయం చేసి ఆడబిడ్డ పెళ్లి ఘనంగా జరగడానికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ ఏ కులాల పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింలు,ఎస్ఆర్ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి జర్నలిస్ట్ పుట్ట రాజు, స్వాతి, సైదయ్య తదితరులు పాల్గొన్నారు.
