ప్రాంతీయం

సెప్టెంబర్ 10న జరగబోయే బీసీ సింహగర్జనను విజయవంతం చేయాలి… 

105 Views
సెప్టెంబర్ 10న జరగబోయే బీసీ సింహ గర్జనను విజయవంతం చేయాలి…
    ముస్తాబాద్ ప్రతినిది సెప్టెంబర్4, గంభీరావుపేట్ మండల కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది .ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ మాట్లాడుతూ ఈనెల10న జరిగే బీసీ సింహగర్జన విజయవంతం చేయాలని విద్యార్థిని విద్యార్థులకు పిలుపునిచ్చారు. బీసీలకు అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు 60 సీట్లు ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీసీలందరూ రాజకీయ పార్టీ ప్రకటిస్తే అన్ని అగ్రకుల పార్టీలకు టులెట్ బోర్డ్ పెట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు బీసీలకు 60టికెట్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం కాదంటే బీసీ సింహగర్జనలో రాజకీయ పార్టీ పెట్టడానికి కూడా వెనకడుగు వేయమని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లానుండి 5వేల విద్యార్థిని విద్యార్థులు తరలిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాలకే టికెట్లని బిజెపి పార్టీ సర్వే బిఆర్ఎస్ పార్టీ సిట్టింగ్లకే చెప్పడం దురదృష్టకరమని బీసీలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 60 టికెట్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం .ఈ కార్యక్రమంలో గంభీరావుపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యక్షులు పాపగారి పవన్ కళ్యాణ్ గౌడ్ మరియు నాయకులు సంకీర్త గౌడ్, నరేంద్ర ,సాయి కిరణ్, వివాంత్, అనీష్ తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *