మంచిర్యాల జిల్లా
నవంబర్ 29 తారీకు బిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా దీక్ష దివాస్ కార్యక్రమాన్ని పెద్దలు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శుక్రవారం రోజున మా పార్టీ జిల్లా ఆఫీసులోని, మంచిర్యాల బిఆర్ఎస్ పార్టీ దీక్ష దివస్ కార్యక్రమాన్ని చేయడం చేసే సందర్భంలో భాగంగా అలంకరణ దృష్టిలో నస్పూర్ మున్సిపాలిటీ జీఎం ఆఫీస్ నుండి మంచిర్యాల మున్సిపాలిటీ ఎసిసి వరకు డివైడర్ కు, తోరణాలతో అలంకరించడం ,చౌరస్తాలలో జెండాలతో,తోరణాలతో అలంకరించడం జరిగింది, అయితే రాజకీయ కుట్ర తోని ,ఒక దురుద్దేశంతోనే వీటిని తొలగిస్తారని సమాచారం మాకు వచ్చినప్పుడు పోలీసులకు మేము తెలియజేయడం జరిగింది. అయినా నస్పూరు,మంచిర్యాల మున్సిపల్ కార్మికులు రాత్రి మరియు ఉదయం అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తోరణాలను, జెండాలను తీసివేయడం జరిగింది.. కానీ నెలల నుండి కాంగ్రెస్ పార్టీ జెండాలు ఉన్న ఎలాంటి చర్యలు చేపట్టని ఈ సిబ్బంది బిఆర్ఎస్ పార్టీ జెండాలు ఉంటే మాత్రం తొలగించడం జరిగింది. గతంలో నస్పూర్ మున్సిపాలిటీలో బిఆర్ఎస్ జెండా గద్దె దగ్గర, తెలంగాణ తల్లితో పాటు ఉన్న జెండా గద్దెకు కూడా కాంగ్రెస్ వాళ్లు వాళ్ళ తోరణాలు పెడితే దానిని కూడా పోలీసుల దృష్టికి బిఆర్ఎస్ నాయకులు తీసుకురావడం జరిగింది, దానిమీద కూడా వారు చర్య తీసుకున్నట్టు మాకు సమాచారం లేదు , మిమ్ములను కోరేది ఏమనగా సిసి టివి ఫుటేజ్ ఉంది కాబట్టి ఒక పార్టీ తన ప్రోగ్రాం చేస్తున్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఈ విధంగా ప్రతిపక్షాల మీద ఈ చర్యను మేము ఖండిస్తున్నాము సిసి టివి ఫుటేజ్ తెప్పించి ఎవరైతే జెండాలు, తోరణాలు, తీసారో వారిపై చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాము. మరియు ఎలాంటి అనుమతి లేకున్నా మున్సిపల్ సిబ్బంది, నస్పూర్, మంచిర్యాల లో జెండాలు తొలగించిన అందుకు గాను,దానికి బాధ్యత వహిస్తూ నస్పూర్ మరియు మంచిర్యాల్ మున్సిపల్ కమిషనర్లపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని డిమాండ్ చేసిన మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు &చెన్నూరు మాజీ శాసనసభ్యులు బాల్క సుమన్, బెల్లంపల్లి మాజీ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య ,బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్.





