ప్రాంతీయం

ఘనంగా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు

35 Views

75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగ కళాశాల ప్రిన్సిపల్ శ్రీ డి.మధు శ్రీవాత్సవ పాల్గొని భారత రాజ్యాంగం భారతీయ ఆత్మ అని ప్రతి ఒక్క భారత పౌరుడి మౌలిక హక్కుల సమహారం అని తెలియజేయడం జరిగింది. రాజ్యాంగంపై సమగ్ర అవగాహన కలిగి ఉండి తమ పరిసర ప్రాంత ప్రజలకు రాజ్యాంగం యొక్క అంశాలను తెలియజేస్తూ ప్రజలకు రాజ్యాంగం పై నిరంతర అవగాహన కల్పించే ప్రక్రియలో భాగస్వాములు అవుతారని ఆశించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ యూనిట్ 1.ఎం.మంగతా నాయక్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ యూనిట్ 2. ఎం.సంపత్ విద్యార్థులను ఉద్దేశించి తమ యొక్క అమూల్యమైన సందేశం అందించడం జరిగింది. అదేవిధంగా కళాశాల పౌర శాస్త్ర అధ్యాపకులు ఎం లక్ష్మీనారాయణకి రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు డి.రాజు, జె.సుధాకర్, ఎస్.దయానంద్, బి.శివకుమార్, ఈ.శ్రీనివాసరెడ్డి, జే.భాగ్యమ్మ, కే.శ్రీనివాస్, వి.అమూల్య తదితరులు ఉన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka