ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి అక్టోబర్13, భారతీయ జనతా పార్టీ నాయకులకు కార్యకర్తలకు పోతుగల్ గ్రామ ప్రజలకు నాహృదయపూర్వక నమస్కారములు. నేను అనగా గోల కృష్ణగౌడ్ గత కొన్నిరోజుల నుండి నాపైన వస్తున్న అభియోగాలపైన ఈరోజు మీడియా పూర్వకంగా వివరణ ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి విషయం ఏమిటంటే గత పదిరోజుల క్రితం నుండి అధికార బిఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీలోకి ఆహ్వానించడం నిజమే కానీవాళ్లు అడిగిన వెంటనే నేను వారిమీద గౌరవంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పడం జరిగింది. కానీ ఈబిఆర్ఎస్ నాయకులు నాపైన అనేక రకాలుగా తప్పుడు మాటలు మాట్లాడుతుండడం కెసిఆర్ సభ మొదలవకముందే బిజెపి నాయకులు అంతా కలిసి బిఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారని దృశ్పచారం చేస్తూ బిజెపి పార్టీని అలాగే నాయకులను తప్పుదోవ పట్టిస్తూ ఆనందం పొందుతున్నారు.. ముస్తాబాద్ మండల బిజెపి నాయకులకు అలాగే పోతుగల్ గ్రామ ప్రజలకు నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే మరోసారి నేను పోతుగల్ గ్రామ
సర్పంచ్ అభ్యర్థిగా నిల్చుంటున్నాను అదికూడా భారతీయ జనతా పార్టీతో పాటు అలాగే గ్రామంలోఉన్న అన్ని కులసంఘాలు బలపరచిన అభ్యర్థిగా బరిలో ఉంటానని తెలియజేస్తున్నాను.. పార్టీ బలోపేతం కోసం నాప్రయాణం కొనసాగిస్తూ అలాగే గ్రామ సమస్యలతో పాటు గ్రామఅభివృద్ధి కోసం నాపోరాటం బిజెపితోనే ఉంటుందని తెలియజేసుకుంటున్నాను అని ఆరోపించారు.




