సిద్ధిపేట మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ నూతన గృహప్రవేశ కార్యక్రమం నాయకులు, అభిమానుల మధ్య ఘనంగా జరిగింది. కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు,దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి,ఎమ్మెల్సీ డా.వంటేరు యాదవ రెడ్డి తదితరులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఫారుఖ్ హుస్సేన్ అతిధులకు తువ్వాలలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఆయనకు వారు శుభాకాంక్షలు తెలియజేశారు.
