(తిమ్మాపూర్ నవంబర్ 06)
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ పంపు ఆపరేటర్ గా పనిచేస్తున్న ఎలగందుల భూమయ్య గత కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులతో ఆసుపత్రిలో వైద్యం చేసుకోలేక ఇంట్లోనే వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ తీసుకుంటున్నాడు, దీన స్థితిలో ఉన్న వారి పరిస్థితి చూసిన నేదునూర్ గ్రామనికి చెందిన తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రెడ్డి గాని రాజు వెంటనే ఈ సమాచారన్ని నుస్తులాపూర్ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు కి తెలపడంతో వెంటనే స్పందించి బుధవారం అ నిరుపేద కుటుంబాన్ని పరామర్శించి, చలించిపోయి వెంటనే 5000 ఆర్థికసాయం చేశారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టి నాయకులు సిరికొండ లక్ష్మణ్ రావు, రెడ్డి గాని మొగిలి, నీలం జగన్ రెడ్డి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు..