ప్రాంతీయం

మహిళలను దింపేసిన ఆర్టీసీ.. చేతులెత్తేసిన ఆర్టీసీ మేనేజర్…

412 Views

ముస్తాబాద్, నవంబర్ 5 (24/7న్యూస్ ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చింది కరీంనగర్ కు కేటాయించిన 70 బస్సుల్లో 35 ఎలక్ట్రిక్ బస్సులను మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రారంభించినది విధమే సిరిసిల్ల నుండి కరీంనగర్ కు ఎలక్ట్రిక్ బస్సుల్లో మహిళలు ఎక్కడంతో బస్సు డ్రైవర్ నేడే ప్రారంభించాము డబ్బులు ఇస్తేనే ఎక్కాలి లేదంటే దిగిపోవాలి అని కోపంతో అనుమతి లేదని దింపేశారు. ఇదే విషయమై సిరిసిల్ల డిపో మేనేజర్ ఏ. ప్రకాష్ రావును వివరణ తెలుసుకో గా ఇది నాకు సంబంధం లేదు అంటూ మీకు కావలసిన జవాబు కరీంనగర్ మేనేజర్ గారిని అడిగి తెలుసుకోవాలని చేతులెత్తేశారు.

No Slide Found In Slider.

Poll not found