సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసులు తిరుమల తిరుపతి దేవస్థానం సేవలో పాల్గొంటూ గత వారం రోజుల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి ఆలయ ప్రాంగణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శనివారం గజ్వేల్ వాసులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పవిత్ర ప్రసాదం లడ్డు సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రముఖ వ్యాపారస్తులు సంతోష్, శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కలియుగ వైకుంఠ వాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి సేవలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం అని శ్రీ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలతో అందరూ బాగుండాలి స్వామివారిని వేడుకోవడం జరిగిందని అన్నారు.
