తొగుట: సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 9ఏళ్ల అభివృద్ధి, సంక్షేమ పాలనను చూసి దేశ ప్రజలు స్వాగతిస్తున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. మండలంలోని వేంకట్రావుపేట లో గ్రామ పార్టీ అధ్యక్షుడు పులిగారి శివయ్య ఆధ్వర్యంలో బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తొగుట మండలం లో గ్రామ గ్రామాన బీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించడం జరిగిందన్నారు..22 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా…సీఎం కేసీఆర్ గారి నాయకత్వం లో పోరాట పటిమతో.. పారదర్శక పాలనతో ముందుకు సాగడం జరిగిందన్నారు.. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పాలన దేశానికి స్ఫూర్తి గా నిలిచిందన్నారు..దేశ ప్రజలు సీఎం కేసీఆర్ ప్రధానమంత్రి గా కావాలని కోరుకుంటున్నారని ఆయన తెలిపారు.. ఈసందర్భంగా దుబ్బాకలో జరిగే పార్టీ ప్రతినిధుల సభకు తొగుట మండలం నుండి భారీ ఎత్తున తరలి వెళ్లడం జరిగిందన్నారు..కార్యక్రమంలో మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు కంకణాల నర్సింలు, సర్పంచ్ పాత్కుల లీలాదేవి వెంకటేశం, రైతు బంధు అధ్యక్షుడు బండారు స్వామి గౌడ్, మార్కెట్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు ఈదుగల్ల పర్శరాములు, సుతారి రాములు తదితరులు పాల్గొన్నారు..
