ముస్తాబాద్, అక్టోబర్ 26 (24/7న్యూస్ ప్రతినిధి) పోలీస్ అమరవీరుల సంస్కరణ వారోత్సవాలను పురస్కరించుకొని ముస్తాబాద్ మండల పోలీస్ ఎస్ఐ సిహెచ్ గణేష్ ఆధ్వర్యంలో పలువురు యువకులు, పోలీస్ సిబ్బందితోపాటు జిల్లాలోని పద్మనాయక మండపంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హాజరై రక్తదానం చేశారు
. జిల్లాలోని అన్ని మండలాల నుండి ఎస్సైలు పోలీస్ సిబ్బంది భారీగా హాజరై శిబిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించిన రక్తదాన శిబిరంలో ఎస్పీతో పాటు పలువురు పోలీస్ లు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సిహెచ్ గణేష్ మాట్లాడుతూ రక్తదానం అంటే ప్రాణదానమేనని అన్ని దానాల్లోకెల్లా గొప్పదని పేర్కొన్నారు. అనంతరం ముస్తాబాద్ మండల యువతతో రక్తదానం చేసిన కార్డులతో కలిసి పాలుపంచుకున్నారు. ఈ కార్యక్రమంలో పోతుగల్ మైసమ్మ యూత్ సభ్యులు, జర్నలిస్ట్ కస్తూరి వెంకటరెడ్డి, బొంబాయి రాజు తదితరులు పాల్గొన్నారు.




