తొగుట మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో మహిళా సంఘాలతో కలిసి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం అని ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫి చేసి రైతులును ఆదుకోవడం జరిగిందని తెలియజేశారు. రుణమాఫి కానీ రైతులు ఆందోళన చెందవద్దని తొందరలోనే ప్రతి రైతుకు రుణమాఫి చేస్తాం అని హామీ ఇచ్చారు అలాగే ఇందిరమ్మ ఇళ్లు పథకం ద్వారా ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నిజం చేస్తామని ఐకెపి సెంటర్ లో రైతుల వడ్లు సకాలంలో కొనుగోలు చేయాలని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ చెరుకు విజయ్ రెడ్డి ( అమర్) మాజీ ఎంపీపీలు గాంధారి లతా నరేందర్ రెడ్డి,గంట రేణుకా రవీందర్, మాజీ సర్పంచ్ లు అనిత నర్సింలు, పాగాల కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అక్కం స్వామి ఎల్లారెడ్డిపేట గ్రామ అధ్యక్షుడు కనికి స్వామి, చెట్టి శ్రీనివాస్, బైతి స్వామి, ఫరీద్, కనకయ్య తదితరాలు పాల్గొన్నారు.
