రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి జయంతి పురస్కరించుకుని వినూతన కళతో చాయ్ పత్త (టీపొడి) ఉపయోగించి వాల్మీకి అద్భుత రూపాన్ని రూపొందించిన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ప్రతి హిందువు ఇంటిలో రామాయణ గ్రంథం వుండాలన్నారు. ఇంట్లో అందరూ చదవాలి ముఖ్యంగా యువత రామాయణాన్ని చదవాలన్నారు. భారతదేశంలో కుటుంబ వ్యవస్థ ఇంత పటిష్టంగా ఉందంటే అది రామాయణంతోనే అని అన్నారు. పితృవాక్య పరిపాలన, ఒకే భార్య, ఒకే బాణం, ఒకే మారు అనేది రామాయణం నుంచే వచ్చిందన్నారు.
పక్షి దుఃఖం చూసి జాలువారిన శ్లోకంతో బోయవాడు మహాకవి వాల్మీకిగా రూపుదాల్చి అద్భుతమైన రామాయణ మహా కావ్యాన్ని లిఖించి అందరి గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావులు వాల్మీకి మహర్షి అన్నారు. మర్యాద పురుషోత్తముడు శ్రీరాముడి దివ్య చరిత్రను సంపూర్ణ మానవాళికి పరిచయం చేసిన ఆదికవి వాల్మీకి మహర్షి అన్నారు. సూర్య చంద్రులు ఉన్నంత వరకు మర్చిపోరన్నారు.
