ముస్తాబాద్ వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ

జనవరి 30, మద్దికుంట గ్రామంలో కళ్యాణ లక్ష్మిచెక్కుల నలుగురు లబ్ధిదారులకు పంపిణి చేశారు. సంపంగి సతవ్వ, పర్స వసంత, కదిరే మమత, సుంచు ఎల్లవ్వ కు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు మండల ఎంపీపీ జనగామ శరత్ రావు స్వయంగా చీరెలను వారికి అందించారు. అదేవిధంగా గోపాల్ పల్లెలో ఒకరికి 1,16,000 ఒక లక్ష16వేలు మిగతా పలు గ్రామాలలో కలుపుకొని 40, చెక్కులను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్ రావు, జెడ్పిటిసి గుండం నరసయ్య, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సురేందర్ రావు, రజక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కరాజు శ్రీనివాస్, ఎంపిటిసిలు, గ్రామపార్టీ నాయకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, అధికారులు, లబ్ధి పొందినవారు తదితరులు పాల్గొన్నారు.




