రాయపోల్ మండల పరిధిలోని రామారం గ్రామంలో మహాదేవుని ఆలయంలో శివ పార్వతుల కళ్యాణం వేద పండితుల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ శివ పార్వతుల కళ్యాణాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అనేక సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకుమత్యం రెడ్డి హాజరైప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని స్థానిక సర్పంచ్ సరోజన హనుమంత్ తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజిరెడ్డి, సందీప్ రెడ్డి, గొల్లపల్లి కనకయ్య, వివిధ పార్టీల నాయకులు, భక్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
