ప్రాంతీయం

దేశం కోసం జీవితాన్నే అంకితం చేసిన వీరుడు భగత్ సింగ్

60 Views

దేశం కోసం జీవితాన్నే అంకితం చేసిన వీరుడు భగత్ సింగ్

చిత్రంతో ఘన నివాళులు అర్పించిన రామకోటి రామరాజు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెప్టెంబర్ 28

భగభగ మండే అగ్నిఖనిక, విప్లవ వీరకిశోరం షాహిద్ భగత్ సింగ్ 117 వ జయంతి సందర్భంగా సుద్ద ముక్కలను ఉపయోగించి 2రోజులు శ్రమించి భగత్ సింగ్ అపురూప చిత్రాన్ని అద్భుతంగా చిత్రించి రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, అవార్డు గ్రహీత రామకోటి రామరాజు

ఈ సందర్బంగా మాట్లాడుతూ 24 ఏళ్ల వయసులో నిండు నూరేళ్ల జీవితాన్ని ఆనందంగా ఉరికంబానికి అంకితం చేసిన మహా దేశభక్తుడు భగత్ సింగ్ అన్నాడు. అయన జన్మించిన ఈ రోజు మనకందరికి పండుగ రోజు అన్నారు. ఒకటే ఆవేదన భరతమాత నీ కోసం నేనేం చేయగలను నీ నుదుటిన సింధూరం చెరిగిపోకుండా నా రక్తాన్ని దర్పణంగా ఇస్తున్నా నా ఒంట్లో ఉన్న చివరి రక్తపు బొట్టు నీ కోసమీ అన్న మహానీయుని మాట మరువొద్దన్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్