ప్రాంతీయం

*పెండింగ్ కేసుల్లో జాప్యం లేకుండా ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారించాలి*

158 Views

-గంజాయి , గుట్కా, గ్యాంబ్లింగ్ ,రేషన్ బియ్యం విక్రయాలపై ప్రత్యేక దృష్టి

-జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

రాజన్న సిరిసిల్ల: తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 25

శుక్రవారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఈ సందర్భంగా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ
పెండింగ్ కేసులను త్వరితంగా పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి దరఖాస్తును ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి, ఎంక్వైరీ రిపోర్టును ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని , క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కేసుల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని సూచించారు. ఎస్ సి/ ఎస్ టి కేస్ లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పోక్సో యాక్ట్ కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. సాంకేతికతను పూర్తి స్థాయిలో వినియోగించుకుంటూ నేరాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. ప్రతి పోలీస్ స్టేషన్ మరియు ఆఫీస్ లలో5s ఇంప్లిమెంటేషన్ చేయాలని సూచించారు. నిందితులను పట్టుకోవడం,నేరాలను నియంత్రణ లో సీసీ కెమెరాలు చాలా ముఖ్య పాత్ర ఉందని సీసీ కెమెరాల పనితీరును ప్రతిరోజూ చెక్ చేసుకోవాలని అన్నారు.అన్ని పోలీస్ స్టేషన్ల పరుధిలోని సీసీ కెమెరాలను జిల్లా కార్యాలయంలోలి కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేయాలి అని అన్నారు..
పోలీస్ స్టేషన్లో ఫంక్షనల్ వర్టికల్స్ గురించి ఎస్సైలు నిత్యం పర్యవేక్షించి పక్కాగా అమలు చేయాలని చెప్పారు.
ఫంక్షనల్ వర్టికల్ రిసెప్షన్, బ్లూ కోల్డ్స్, పెట్రోల్ కార్స్, కోర్టు, క్రైమ్, జనరల్ డ్యూటీ, స్టేషన్ రైటర్స్, టెక్ టీమ్ రైటర్స్, సమ్సస్, వారెంట్, సెక్షన్ ఇంచార్జ్, విధులు నిర్వహించే అధికారులు సిబ్బంది ప్రజల రక్షణ గురించి మరింత బాధ్యతాయుతంగా మానవీయ కోణంలో విధులు నిర్వహించాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు,అక్రమ వ్యాపారాలు పై నిఘా ఉంచాలి అని జిల్లాకు రాష్ట్ర సరిహద్దుల నుండి వచ్చే గంజాయి, గుట్కా సరఫరా చేసే మూలాలను, కీలక వ్యక్తులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసి అక్రమ రవాణా పకడ్బందీగా నియంత్రించాలన్నారు.అలాగే జిల్లాలో అక్రమ వడ్డీవ్యాపారుస్తులపై నిగ పెట్టి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయాలని అన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై నిఘా ఉంచాలని వారి పై కేస్ లు నమోదు చేయాలని అన్నారు.

ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య,డిఎస్పీ లు చంద్రకాంత్,రవికుమార్ సి.ఐ లు అనిల్,ఉపేందర్,మోగిలి,వెంకటేశ్,శ్రీలత,నవీన్ కుమార్,సర్వర్, ఆర్.ఐ లు కుమారస్వామి, రజినీకాంత్, యాదగిరి, ఎస్.ఐ లు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7