ప్రాంతీయం

పోక్సో చట్టంపై విద్యార్థినీలకు అవగాహన కల్పించిన ఎస్సై…

120 Views
ముస్తాబాద్, సెప్టెంబర్ 27 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్, మండలంలోని బదనకల్, వెంకట్రావు పల్లె ప్రాథమిక పాఠశాలల్లో ఎస్ఐ సిహెచ్. గణేష్, విద్యార్థులకు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణపై పోక్సో చట్టంపై అవగాహనా కల్పించారు. ఎస్ఐ మాట్లాడుతూ. ఆడపిల్లల యొక్క విద్య, పోషకాహారం ప్రాముఖ్యత గురించి , ఆరోగ్య సమస్య లు, బాల్య వివాహా నీషేధ చట్టం అదేవిధంగా ఆడపిల్లలపై లైంగిక వేధింపులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయని ఎవరిని నమ్మవద్దని, లైంగిక వేధింపులపై పోక్సో చట్టం మరియు సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని వాట్సాప్ ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు పెట్టకూడదని మార్ఫింగ్ చేస్తారని కావున జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఆపద సమయంలో హెల్ప్ లైన్ నెంబరు100 ఉపయోగించుకోవాలని. మరిన్ని గ్రామాల్లో పాఠశాలలలో పోక్సో చట్టంపై నిర్వహించే దిశగా నిలుస్తామన్నారు. ఈచట్టం ద్వారా నిర్దేశించబడిన పిల్లల లైంగిక వేధింపులను నిరోధించడంలో పాఠశాల సిబ్బంది బాధ్యతలుకూడ కీలకమని పేర్కొన్నారు. 
Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్