మంచిర్యాల జిల్లా:
బెల్లంపల్లి పట్టణం కాంటా చౌరస్తాలో 7 కోట్ల 58 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన కూరగాయల మార్కెట్ ను *ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*
పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత,ఆర్డీఓ హరికృష్ణ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు, లబ్దిదారులు.
*ఎంపి వంశీ కృష్ణ * మాట్లాడుతూ:
ఎన్నికల్లో కూరగాయల మార్కెట్ కావాలని స్థానికులు అడిగారు.
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్ని నెరవేరుస్తాం
గత బిఆర్ఎస్ పది యేండ్ల పాలన లో రాష్ట్రం అప్పులపాలు అయ్యింది.
వానకు,ఎండలకు రోడ్ల పైన కూరగాయలు అమ్ముకుంటూ వ్యాపారులు ఇబ్బందులు పడే వారు,కానీ ఆ ఇబ్బందులు ఇప్పుడు ఉండవు.
కూరగాయల మార్కెట్ ప్రారంభించడం ఆనందంగా ఉంది.
గతం లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిరుపేదలకు సోలార్ తోపుడు బండ్లు పంపిణీ చేశాం.
ఇక్కడ ఎవరికైనా ఇబ్బందులు కలిగితే విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తాం.
ఎంపీ నిధుల నుండి బెల్లంపల్లికి కావాల్సిన సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటాం.
