– చాముండేశ్వరి గురు దత్త పీఠాధిపతి కొడకండ్ల శ్రీరామ చరణ్ శర్మ
దౌల్తాబాద్: చదువుతోనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని చాముండేశ్వరి గురు దత్త పీఠాధిపతి కొడకండ్ల శ్రీరామ చరణ్ శర్మ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని దొమ్మాట, గాజులపల్లి పాఠశాలలో సాయి దీప రాక్ డ్రిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులకు, విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలన్నారు. క్రమశిక్షణ విద్యార్థులకు అద్భుతమైన ఆయుధమని దానిని విద్యార్థులు ఉపయోగించుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. చిన్నారులు మీ బాల్యంలో నేర్చుకునే విద్యాబుద్ధులే మీ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. విద్యార్థులు ఇష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నాయని విద్యార్థులు అవకాశాలను వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు పూజిత వెంకటరెడ్డి, అప్ప వారి శ్రీనివాస్, సాయి దీప రాక్ డ్రిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ రావు, ప్రధానోపాధ్యాయులు నయిమా కౌసర్, త్యాగరాజు, సర్దార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు……