ముస్తాబాద్, నవంబర్19 (24/7న్యూస్ ప్రతినిది) గూడెం గ్రాస్థులందరూ పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ముందుకు సాగారు. ఊరంత చల్లగా, పాడి పంటలు బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని పోచమ్మ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. గూడెం గ్రామంలో పోచమ్మ బోనాలు అమ్మవారికి గౌడ సంఘం, ముదిరాజ్ సంఘం, శాలివాహన (కుమ్మరి) సంఘం, విశ్వబ్రాహ్మణుల సంఘం, గంగపుత్ర (బెస్త) సంఘం ల అధ్వర్యంలో బైండ్ల వారి అట పాటలతో చిందులు వేస్తూ అమ్మవారికి పూజలు మొక్కులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శేశాచారి, శ్రీధర చారీ గ్రామస్ధులు తదితరులు పాల్గొన్నారు.
