ప్రాంతీయం

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి – వాసవి క్లబ్ అద్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్

41 Views

సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని కస్తూరి బాయి గాంధీ బాలికల కళాశాలలో బుదవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సీడ్ బాల్స్ చల్లారు. ఈ సందర్భంగా వాసవిక్లబ్ అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని, వాసవి క్లబ్ వారి సూచన మేరకు వివిధ రకాల చెట్ల విత్తనాలు,మట్టి బాల్స్ తయారు చేసి వాటిని చల్లడం జరిగిందని పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహద పడతాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ప్రధాన కార్యదర్శి సిద్ది నవీన్,ఉమేష్,ప్రశాంత్, సిద్ది రామచంద్రం, చంద్ర శేఖర్,వెంకటేష్,వాసవి క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Manne Ganesh Dubbaka