బెస్ట్ ఎడ్యుకేటర్ , బెస్ట్ కరస్పాండెంట్ అవార్డు పొందిన గోపతి సత్తయ్య
మంచిర్యాల , సెప్టెంబర్ 15
అఖిలభారత ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ , డిజిటల్ మీడియా, ట్రస్మా సంయుక్తంగా రాష్ట్ర రాజధాని హైదరాబాదులో నిర్వహించిన నేషనల్ లెవెల్ సెమినార్ లో జిల్లా కేంద్రం లోని సిసిసిలో గల ఆదిత్య హై స్కూల్ కరస్పాండెంట్ గోపతి సత్తయ్య బెస్ట్ ఎడ్యుకేటర్ , బెస్ట్ కరస్పాండెంట్ అవార్డు కు ఎంపికయ్యారు. దీంతో ఆదివారం నిర్వాహకులు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో శనివారం సాయంత్రం ఆయనను ఘనంగా సత్కరించి అవార్డు ను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోపతి సత్తయ్య గత 32 సంవత్సరాలుగా కోల్ బెల్ట్ ప్రాంతంలో విద్యా సేవలు అందిస్తూ ఎంతో మంది విద్యార్థులను ప్రయోజకులుగా మార్చి ఉన్నత శిఖరాలను అధిరోహించేలాగా విద్యా బోధన చేశాడని కొనియాడారు. ఆయన సేవలను గుర్తించి ఈ అవార్డు ప్రధానం చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.
* నిస్వార్థ మైన సేవకు గుర్తింపు : గోపతి సత్తయ్య.
తన పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థి క్రమ శిక్షణ అలవర్చుకోవాలి, మంచి ప్రయోజకులు కావాలని తలచి గత 32 ఏళ్ళుగా అలుపెరుగని కృషి చేశానని, నిస్వార్థ మైన సేవకు గుర్తింపు గా ఈ అవార్డు రావడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. గౌరవ ప్రదం గా ఉందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆదివారం జిల్లా కేంద్రం లో ని ఆదిత్య హై స్కూల్లో ఆయన మిత్రులు, అధ్యాపకులు గోపతి సత్తయ్య ను ఘనంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు.
