ప్రాంతీయం

ప్రధాన రహదారిపై రైతుల ధర్నా…

105 Views

ముస్తాబాద్/నవంబర్/12; ముస్తాబాద్ మండలం కొండాపూర్ గ్రామం అఖిలపక్షం ఆధ్వర్యంలో రహదారిపై రైతుల ధర్నా..! శుక్రవారంరోజున కొండాపూర్ లో పిఎసిఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రంలో గతవారం క్రితం పిఎసిఎస్ చైర్మన్  చెప్పిన ప్రకారం42.300 జాలి పట్టకుండా ఉండాలని నిర్ణయించారు. కానీ వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభమైన తర్వాత పొల్లు పట్టాలని మరల చెప్పారు. దీనితో ఆగ్రహానికి గురైన రైతులు స్థానిక గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి గ్రామశాఖ అధ్యక్షులు గురు వెంకన్న ముదిరాజ్ ,బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు గుడికందుల మహేందర్ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు క్యారం రాజు, బిజెపి సీనియర్ నాయకులు అనిల్, తెరాస మండల నాయకులు నాగలి దేవయ్య, గంధం మల్లయ్య, పరశురామ్ యాదవ్, TRSV విద్యార్థి విభాగం గ్రామశాఖ అధ్యక్షులు బండి ఆదర్శ పటేల్, బిజెపి నాయకులు అయినేని అంజిరెడ్డి, సుతారి దేవయ్య, సర్దార్ సాయి, రైతులు పెండ్యాల జగదీశ్వర్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, నారాయణరెడ్డి, గుడికందుల భాస్కర్ రెడ్డి ,నవీన్ గౌడ్ ,నిమ్మ మాధవరెడ్డి , రైతులు తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్