ముస్తాబాద్, జూన్ 2 (24/7న్యూస్ ప్రతినిధి): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మద్దికుంట కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు దోనుకుల కొండయ్య ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కదిరె నరేష్, యూత్ అధ్యక్షులు మెతుకు మధు, సోషల్ మీడియా అధ్యక్షులు సుంచు మహేష్, ఎస్సీ సెల్ అధ్యక్షులు పల్నాటి వెంకట్, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కదిరి సత్తి గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సూత్రం రాజమల్లయ్య, మాజీ సర్పంచ్ కరణాల అనిల్, సురభి రాజు, కుడుదుల అంజయ్య, సుంకర ప్రశాంత్, సుంచు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
