Breaking News

నెల్లటూరు అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలు

126 Views


తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను గర్భవతులు బాలింతలు తీసుకోవాలని ఐసిడిఎస్ గూడూరు సిడిపిఓ మెహబూబీ కోరారు. శుక్రవారం గూడూరు మున్సిపల్ పరిధిలోని నెల్ల టూరు_1 అంగన్వాడి కేంద్రంలో పోషణ్ పక్వాడ్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం అంగన్వాడీ కేంద్రాలు గర్భవతులకు బాలింతలకు కిషోరి బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకుని బలవర్ధకమైన బిడ్డలకు జన్మనివ్వాలని అలాగే తల్లిపాలు విశిష్టత గురించి కూడా ఆమె తల్లులకు వివరించారు. గర్భవతులు తక్కువ ఖర్చుతో కూడిన పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకొని ఆరోగ్యవంతంగా ఉండాలని ఆమె అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు అందించే పోషక పదార్థాలను క్రమ తప్పకుండ తీసుకున్నాలన్నారు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు అందించే పోషక పదార్థాలు నాణ్యమైన బలవర్ధకమైన ఆహారం అని ఆమె అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పాలు ఇతర ఆహార పదార్థాలను గర్భవతులు బాధితులు తప్పనిసరిగా తీసుకోవాలని ఆమె సూచించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె వెంట సూపర్వైజర్ అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
శివ ప్రసాద్ నెల్లూరు జిల్లా ఇంచార్జ్