Breaking News

చెత్త సేకరణ కోసం పురవీధుల్లో ఆటో రిక్షాలు

217 Views

చెత్త సేకరణ కోసం చిన్నచిన్న వీధులలో ఆటో రిక్షా లను ఏర్పాటు చేసినట్లు ఎల్లారెడ్డిపేట గ్రామ సర్పంచ్ నెవూరి వెంకట్ రెడ్డి తెలిపారు గ్రామపంచాయతీ పరిధిలో గల 14 వార్డులలో చెత్త సేకరణకు వినియోగించే ఆటో రిక్షా ను స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఉగాది తెలుగు సంవత్సరాది సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఆటో రిక్షా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామంలో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్ లు ఇప్పటికే ఉండగా చిన్నచిన్న వీదులలోకి ఆటో రిక్షా పంపించి చెత్తసేకరణ చేయడం జరుగుతుందని ఇట్టి అవకాశం గ్రామప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అదే విదంగా 85 లక్షల మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ నిధులతో చేపట్టబోయే సీసీ రోడ్లు నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్,వార్డు సభ్యులు జవ్వాజి లింగం,న్యాలకంటి దేవేందర్, కోడిమోజు దేవేందర్, గడ్డమీది లావణ్య,ద్యాగం లక్ష్మీ నారాయణ, పందిర్ల శ్రీనివాస్, గంట బాలకృష్ణ, ఏర్పుల శ్రీనివాస్,టిఆర్ఎస్ నాయకులు పందిర్ల పరశురాములు ,ఎనగందుల నర్సింలు ,ఎనగందుల బాబు రేసు గణేష్ ,మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజ్ యాదవ్, నేవూరి శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు

Oplus_131072
Oplus_131072
కొండ్లెపు జగదీశ్వర్ జర్నలిస్ట్ ఎల్లారెడ్డిపేట్