అన్ని రకాల పూసలతో గణపతి అపురూప చిత్రం
భక్తితో చిత్రించి ఆవిష్కరించిన రామకోటి రామరాజు
సిద్దిపేట జిల్లా గజ్వేల్ సెప్టెంబర్ 13
వినాయక నవరాత్రోత్సవాల్లో భాగంగా అన్ని రకాల పూసలను వినియోగించి అత్య అద్భుతంగా గణనాథుని చిత్రాన్ని చిత్రించి శుక్రవారం నాడు రామకోటి కార్యాలయంలో ఆవిష్కరించి ప్రత్యేక పూజలు చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న, కళారత్న, సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు
ఈ సందర్బంగా మాట్లాడుతూ అన్ని విజ్ఞాలు తొలగించే విగ్నేశ్వరున్ని 9రోజుల పాటు భక్తులు భక్తి శ్రద్దలతో వేడుకుంటారన్నారు. భక్తితో భగవంతుని చిత్రాలు ఎన్నో చిత్రించానని భగవంతుని ఆశీషులు ఉంటే సాధించనిది ప్రపంచంలో ఏదీ లేదన్నారు.
