అమ్మవారిని దర్శించుకున్న గజ్వేల్ మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి..
గజ్వేల్ సెప్టెంబర్ 13
జగదేవ్పూర్ మండల పరిధిలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలోని శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి తో కలిసి గజ్వేల్ మార్కెట్ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం నూతనంగా ఎన్నికైన మార్కెట్ చైర్మన్ నరేందర్ రెడ్డి,మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి లను తీగుల్ నర్సాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ రజిత రమేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పనుగంటి రాజు. జనార్దన్ రెడ్డి భూముల మల్లయ్య గడ్డం బిక్షపతి బీరయ్య వరిమడ్ల బిక్షపతి గడ్డం రాజు రమేష్ శీను తదితరులు పాల్గొన్నారు.
