ప్రాంతీయం

రైతులకు నష్టం కలగకుండా జాతీయ రహదారి విస్తరించాలి

92 Views

మంచిర్యాల జిల్లా

*రైతులకు నష్టం జరగకుండా జాతీయ రహదారి విస్తరించాలి*

NHAI హైదరాబాద్ రీజియన్ రీజినల్ ఆఫీసర్ గా ఇటివల నూతనంగా బాధ్యతలు చేపట్టిన శివ శంకర్ ని పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యులు బొర్లకుంట వెంకటేష్ నేత, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి , భూమి కోల్పోతున్న రైతులు మరియు ఇతరులతో కలవడం జరిగింది. ఆర్మూర్ – మంచిర్యాల మధ్య జాతీయ రహదారి 63 విస్తరణ లో భాగంగా లక్షట్టిపెట్ మండలం మరియు హాజీపూర్ మండల రైతులు గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు లో తమ పంట భూములు కోల్పోయారని ఇప్పుడు మళ్ళీ రైతుల భూములు జాతీయ రహదారి కోసం ఇస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని కావున రైతులు నష్ట పోకుండా జాతీయ రహదారి విస్తరించి రైతులకు న్యాయం చేయాలని ఆర్వో గారిని కోరడం జరిగింది.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్