ప్రాంతీయం

విద్యార్థులు క్రీడల్లో రాణించి దేశంలో మంచిపేరు తేవాలి.. ఎస్సై

147 Views

ముస్తాబాద్, సెప్టెంబర్ 11 (24/7న్యూస్ ప్రతినిధి): పోతుగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్ జి ఎఫ్ మండల స్థాయి పాఠశాలల క్రీడోత్సవాలలో భాగంగా జెండా ఆవిష్కరణ చేసి అండర్ 14, అండర్ 17 బాలికల కబడ్డీ, వాలీబాల్, కోకో పోటీలను ఎస్సై సిహెచ్, గణేష్ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ విద్యార్థినీ, విద్యార్థులకు క్రీడలు శారీరక ధృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని క్రీడాకారులకు గెలుపు ఓటములు సహజమని, ఓడినవారు గెలిచిన వారిని స్ఫూర్తిగా తీసుకొని క్రీడల్లో రాణించాలన్నారు. విద్య మనకు ఎలాజ్ఞానాన్ని ఇచ్చి మెరుగుపరుస్తుందో అదేవిధంగా క్రీడలు కూడా మన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి అని అన్నారు. విద్యతో పాటు క్రీడలు కూడా మనలో భాగస్వామ్యం అయినప్పుడు పరిపూర్ణతగల మనిషిగా అభివృద్ధి చెందుతారనీ సమాజంపట్ల పేరుతో పటు ఇటు తల్లిదండ్రులకు గర్వించేలా ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు, మాజీ జెడ్పిటిసి గుండం నరసయ్య, సీనియర్ నాయకులు ఒరగంటి తిరుపతి, పెద్దిగారి శ్రీనివాస్, మండల నోడల్ అధికారి రాజిరెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణన్ రావు, పలువురు నాయకులు, ఉపాధ్యాయులు, పలు పాఠశాల క్రీడాకారులు, తదితరులు  పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
కస్తూరి వెంకట్ రెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్