తొగుట: మండలంలోని చందాపూర్ లో శుక్రవారం రాత్రి సర్పంచ్ బొడ్డు నర్సింలు ఆధ్వర్యంలో రంజాన్ మాసం సందర్భంగా ముస్లీం సోదర, సోదరీమణులకు ఇప్తార్ విందు ఏర్పాటు చేశారు. ఇప్తార్ విందులో పాల్గొని ముస్లీం సోదర, సోదరీమణులకు రంజాన్ ఉపవాస దీక్షల సందర్భంగా వారికి అల్లా ఆశీస్సులు ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు.. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ నర్సెట్టి మల్లేశం, ఉప సర్పంచ్ చంద్రం, నాయకులు సుభాష్,అనిల్,చందా సత్తయ్య.మాజీ సర్పంచ్ బెజగామ కిష్టయ్య చందా రాజు తదితరులు పాల్గొన్నారు
