ప్రాంతీయం

స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

29 Views

స్వంత ఇంటి కలను సాకారం చేస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వం

మంచిర్యాల నియోజకవర్గం.

దండేపల్లి మండలానికి చెందిన 588 మంది లబ్దిదారులకు మరియు లక్షెట్టీపేట్ మండలానికి చెందిన 477మంది లాబ్దిదారులకు, లక్షెట్టీపేట్ మున్సిపాలిటీకి చెందిన 237 మంది లబ్దిదారులకు మరియు హజీపూర్ మండలానికి చెందిన 281 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లును ఇస్తామని చెప్పి మాటను నిలబెట్టుకొని ఇప్పటివరకు దండేపల్లి మండలంలో 692 మంది లబ్దిదారులకు మరియు లక్షెట్టీపేట్ మండలానికి, మున్సిపాలిటీకి 931 మంది లబ్దిదారులకు మరియు హజీపూర్ మండలానికి 445 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇల్లును ఇచ్చామని చెప్పారు.

పైలెట్ ప్రాజెక్టు ద్వారా ఎంపికైన ధర్మరావుపేట్ , ర్యాలీ, కొత్తూరు గ్రామాల ఇందిరమ్మ ఇళ్ల లాబ్దిదారులు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ని శాలువాతో సన్మానించారు..

ఈ కార్యక్రమంలో సంబంధింత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, మండల నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్